Chandrababu Visits Purushothapatnam: పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ అటకెక్కించింది: చంద్రబాబు - చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
🎬 Watch Now: Feature Video
Chandrababu Purushothapatnam Visit: పోలవరం నిర్వాసితులకు అధిక పరిహారం ఇస్తానని హామీ ఇచ్చిన జగన్.. సీఎం అయిన తరువాత మళ్లీ కనిపించకుండా పోయాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నం రోడ్డు ఎంత అధ్వాన్నంగా ఉందో.. ముఖ్యమంత్రి కూడా అంతే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం వరకు దాదాపు 35 కిలోమీటర్లు ఉండగా.. 4 గంటల పాటు సాగింది. పూర్తిగా దెబ్బతిన్న రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతూ పర్యటన జరిగింది. రాజానగరం నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలో గజమాలలతో చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తొలిదశ పనులను ఆయన పరిశీలించి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ అటకెక్కించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం భూ నిర్వాసితుల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నం వచ్చేసరికి రోడ్డు గుంతలకు తన నడుం దెబ్బతిని దుమ్మంతా తన పొట్టలోకే పోయిందని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే భూ నిర్వాసితులకు వడ్డీతో సహా న్యాయం చేయటంతో పాటు రాజమండ్రి - పురుషోత్తపట్నం రోడ్డు పూర్తిగా మార్చి చూపిస్తానని హామీ ఇచ్చారు.