ఏపీలో ధర్మపరిరక్షణ జరగాలి - తెలంగాణ ఫలితాలపై తర్వాత స్పందిస్తా: చంద్రబాబు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 5:28 PM IST
Chandrababu Visited Simhachalam Temple: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ధర్మపరిరక్షణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ధర్మం కాపాడబడట్లేదన్నారు. దైవ సన్నిదిలో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. హిరణ్యకశిపుడు విర్రవీగితే లక్ష్మీనరసింహ స్వామి దుష్ట శిక్షణ చేసాడు. రాష్ట్రాన్ని కాపాడేందుకు మళ్లీ దుష్ట శిక్షణ అవసరం ఉందని అన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి సేవా ట్రస్టు వారసులనే వేధిస్తున్నారంటే, ఇక ధర్మం ఎక్కడుంది? భావితరాల భవిష్యత్తు కోసం ప్రజలంతా ఏకమై కలిసి నడవాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫలితాల గురించి స్పందిస్తూ దైవ సన్నిధిలో వాటి గురించి మాట్లాడను. వేరొక చోట స్పందిస్తానని అన్నారు. చంద్రబాబు రాక సందర్భంగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ, జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో బారీగా పోలీసులను మోహరించి అంక్షలు విధించారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అప్పన్న దర్శనం అనంతరం చంద్రబాబు విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.