Chain Business Victims Stop a Container Lorry: గొలుసుగా కట్టారు.. నిండా మునిగారు..! - గొలుసుకట్టు వ్యాపార మోసాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 27, 2023, 6:16 PM IST
Chain Business Victims Stop a container Lorry: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ కంటైనర్ లారీని గొలుసుకట్టు వ్యాపార(Chain business) బాధితులు అడ్డగించారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గొలుసుకట్టు వ్యాపారంలో కొందరు బాధితులు మోసపోయారు. చిన్న చిన్న మొత్తం పెట్టుబడులతో ఓ యాప్లో కొండపల్లి గ్రామానికి చెందిన కొందరు పెట్టుబడులు పెట్టారు. కొంతకాలంగా యాప్ పనిచేయకపోవడంతో తాము మోసపోయమని గ్రహించిన గ్రామస్థులు న్యాయం కోసం పోరాడుతున్నారు. యాప్ను నమ్మి లక్షల్లో పెట్టుబడులు పెట్టామనీ.. తీరా ఆ యాప్ పనిచేయండం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యాప్ లోగోతో భద్రాచలం వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ లారీని బాధితుడు గుర్తించి స్థానికులను అప్రమత్తం చేశాడు. వెంటనే వారు ఆ లారీని అడ్డుకున్నారు. ఆ కంటైనర్ను బాధితులు తాను నివసిస్తున్న ఏరియాకు బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. యాప్ బాధిత గ్రామస్థులతో మాట్లడారు. వారికి నచ్చ జెప్పేప్రయత్నం చేశారు. అయినప్పటికి యాప్ బాధితు శాంతిచకపోవడంతో... పోలీసులు కంటైనర్ను ఇబ్రహీంపట్నం(Ibarhimpatnam) పోలీస్ స్టేషన్ కు తరలించారు.