అమరావతిని కాపాడాలంటూ మొక్కులు - దీక్షా శిబిరాల్లో ప్రత్యేక పూజలు
🎬 Watch Now: Feature Video
Capital Amaravati Farmers Protests: ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, వెంకటపాలెం శిబిరాలలో మహిళలు దీక్షలు నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకొని దీక్ష శిబిరాలలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. అమరావతిని కాపాడాలంటూ దేవుళ్లకు మొక్కుకున్నారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు.
కాగా రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 1490 రోజులుగా కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. నాలుగేళ్లుగా పలు వినూత్న కార్యక్రమాల ద్వారా తమ నిరసన తెలుపుతూ వస్తున్నారు. అమరావతి కోసం పండగల సమయంలో కూడా నిరంతరాయంగా ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని జగన్ చూస్తున్నారని వాపోయారు. ఈ రోజు సంక్రాంతి పండగ సమయంలో సైతం దీక్షా శిబిరాల్లో నిరసనలు కొనసాగించారు.