Byreddy Rajasekhar Reddy Fires on CM Jagan: 'జగన్ వైఖరితో రాష్ట్రం సర్వనాశనమైంది.. ఇప్పటికైనా కృష్ణాజలాల వాటాపై స్పందించాలి' - krishna water dispute tribunal
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 5:33 PM IST
Byreddy Rajasekhar Reddy Fires on CM Jagan: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీని పునఃసమీక్షించాలన్న.. కేంద్రం నిర్ణయం ఏపీకి శాపమని రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ (Rayalaseema Steering Committee chairman) బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతతో రాయలసీమకు.. తాగునీరు కూడా దొరికే పరిస్థితి ఉండదన్నారు. జగన్‌కు వాటర్ బాటిళ్ల కంపెనీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందేమో అని బైరెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా ఉండేందుకు జగన్ అనర్హుడు అని బైరెడ్డి మండిపడ్డారు. జగన్ బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని.. మోదీకి భయపడుతున్నారని బైరెడ్డి విమర్శించారు.
రాష్ట్ర జల సమస్యలపై జగన్ ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. సీఎం జగన్.. అన్ని వర్గాలనూ మోసం చేస్తున్నారని బైరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైఖరితో రాష్ట్రం సర్వనాశనమైందని అన్నారు. ఏపీ.. రాజధాని లేని, అభివృద్ధి లేని రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌కు రాష్ట్రం గురించి ఆలోచించే సమయం లేదన్న బైరెడ్డి.. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదని.. అరెస్టుల ప్రదేశ్ అని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఇప్పటికైనా కృష్ణా జలాల వాటాపై స్పందించాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కోరారు.