ప్రయాణిస్తున్న బస్సులో మంటలు - ప్రయాణికులకు ముచ్చెమటలు - నెల్లూరులో ఘటన - మంటల్లో చిక్కుకున్న బస్సు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 3:18 PM IST

Bus Catches in Fire at Nellore: నెల్లూరు నుంచి ముత్తుకూరు వెళ్తున్న ఓ బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రయాణిస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో అందులోని ఉద్యోగులకు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టిన వారు ఆ బస్సు నుంచి తప్పించుకున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. నెల్లూరు నుంచి ఓ ప్రైవేటు బస్సు ముత్తుకూరులోని థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఉద్యోగులను తీసుకెళ్తోంది. అయితే ఈ బస్సు కాకుపల్లి సమీపంలోకి రాగానే అందులో పొగలు రావడాన్ని డ్రైవర్​ గుర్తించారు. దీంతో అనుమానం కలిగి అతడు బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి.. ఏమైందో చెక్​ చేశాడు. అదే సమయంలో అందులో ఉన్న ఉద్యోగులు పొగ రావడాన్ని గమనించారు. వెంటనే బస్సులోంచి కిందకు దిగారు. వారు కిందకు దిగిన మరుక్షణమే బస్సులో దట్టమైన పొగలతో.. మంటలు చెలరేగాయి. డ్రైవర్​తో సహా అందరూ బస్సు నుంచి దూరం వెళ్లిన కొద్ది సమయంలోనే బస్సులో పూర్తిగా మంటలు విస్తరించాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు చెలరేగి.. బస్సు పూర్తిగా ఆగ్నికి ఆహూతికావడం చూసిన ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు నుంచి అందరూ దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.