వైఎస్సార్​ కిట్ల పంపిణీకి అంగన్వాడీలు రాకపోతే ప్రత్యామ్నాయం చూస్తాం: బొత్స - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 7:11 PM IST

Botsa Satyanarayana Comments on Anganwadi Workers: జనవరి 5న వైఎస్ ఆర్ పోషణ కిట్ల పంపిణీకి అంగన్వాడీలు రాకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం వెతుక్కుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని పక్కి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని సంక్షేమం అందరికీ అందుతోందన్నారు. అంగన్వాడీల 11 రకాల డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు అందులో 10 వరకు ఆమోదించామని, జీతాల పెంపు కోసం రెండు నెలలు ఆగాలని చెప్పామని తెలిపారు. అయినప్పటికీ వారు ఆందోళన విరమించడం లేదన్నారు. 5వ తేదీ నుంచి వైఎస్ఆర్ పోషణ కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఒకవేళ వాళ్లు పంపిణీ చేయకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం వెతుక్కుంటుందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచుతున్నప్పుడల్లా ఇక్కడా పెంచమనడం సరి కాదని అన్నారు. తెలంగాణలో తక్కువ వేతనాలు ఉండేటప్పుడు తాము ఎక్కువ చెల్లించిన సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని సంక్షేమం అందరికీ అందుతుంది. ప్రతి ఇంటికి పథకాలు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని దక్కిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.