Bonda Uma Warns to Officials about Votes Deletion: టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే అధికారులు జాగ్రత్త: బోండా ఉమా
🎬 Watch Now: Feature Video
Bonda Uma Warns to Officials about Votes Deletion: వైసీపీ దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం సానుభూతిపరుల(Telugu Desam sympathizer) ఓట్లు తొలగించాలని చూస్తోందని అనుమానాలు వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతి ఓట్లను తొలగించటానికి సజ్జల ఆధ్వర్యంలో పెద్ద టీమ్ పని చేస్తుందని బోండా ఉమా పేర్కొన్నారు. ప్రభుత్వాధికారులను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ చెప్పినట్లు చేసి అనంతపురం జెడ్పీ సీఈఓ భాస్కరరెడ్డి సస్పెండ్ అయ్యాడని ఎద్దేవా చేశారు. పాత జెడ్పీ సీఈవో శోభ స్వరూప కూడా సస్పెండ్ అయ్యారని బోండా తెలిపారు. త్వరలో వీళ్లను అరెస్టు కూడా చేస్తారని చెప్పారు. వైసీపీ మాటలు విని తప్పుడు విధానాలతో ఓట్లు తొలగించే ఏ అధికారికైనా ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం ఓట్ల వెరిఫికేషన్‌పై మానిటరింగ్ టీమ్ పెట్టామని ఉమా పేర్కొన్నారు. ఎక్కడైనా, ఎవ్వరైనా తప్పు చేస్తే తెలిసిపోతుందన్నారు. రాష్ట్రంలో ఓటరు లిస్టు అక్రమాలపై త్వరలో దిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషన్‌ను చంద్రబాబు కలుస్తారని బోండా ఉమా తెలిపారు.