Bonda Uma Allegations on Jagan Corruption in Discoms: జనంపై రూ.64వేల కోట్ల విద్యుత్ భారం.. జగన్ జేబుల్లోకి ధనం : బోండా ఉమా - Performance of AP Discoms

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 3:59 PM IST

Bonda Uma Allegations on Jagan Corruption in Discoms: డిస్కంలను నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం ప్రజలపై రూ. 64 వేల కోట్ల భారం మోపిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అంతులేని అవినీతికి ప్రజలు బలైపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలకు పండుగ కానుకలిస్తే, జగన్మోహన్ రెడ్డి పండుగ బాదుడు మోపుతున్నాడని దుయ్యబట్టారు. బహిరంగ మార్కెట్​లో కొనుగోలు చేసే విద్యుత్​లో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

దాదాపు పన్నెండున్నర కోట్ల రూపాయల విద్యుత్​ని మార్కెట్ ధర కంటే అదనంగా వెచ్చించి కొనుగోలు చేశారన్నారు. ఒక్క సెకీ ఒప్పందంలోనే 20 వేల కోట్ల అవినీతి జరిగితే.. ఆ ప్రభావంతో ప్రజలపై 20 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. బాదుడు ప్రజలపైన అయితే, నగదేమో తాడేపల్లి ప్యాలెస్​కు పోయాయని ఉమా ధ్వజమెత్తారు. ఈ అవినీతి ప్రభుత్వానికి త్వరలోనే చరమగీతం పాడతామని ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.