Bjp Leader Vishnu Kumar Raju: 'అరాచక శక్తులు అడ్డాగా ప్రభుత్వ పని తీరు..' - Transportation of marijuana
🎬 Watch Now: Feature Video
Bjp Leader Vishnu Kumar Raju Interview : ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పని తీరు అరాచక పాలనకు నిదర్శనంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రశాంతమైన విశాఖ నగరం భూ దందాలకు కేంద్రంగా మారిందని.. అరాచక శక్తులు అడ్డాగా తయారైందని కేంద్ర హోం మంత్రి అమిషా అన్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమయ్యేలా ప్రస్తుతం ఘటనలు ఉన్నాయని విష్ణుకుమార్ అన్నారు. ఎంపీ కుటుంబం కిడ్నాప్ అవ్వడం, వారు కూడా బయట చెప్పుకోలేనంత విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయం తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, దానికి కట్టుబడి ఉంటామని తెలియజేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుచీలకుండా చూడాలన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంకల్పం నెరవేరాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో గణాంకాలు నేరాల సంఖ్యను మాత్రమే తెలియజేస్తున్నాయని, అవి ఎంత తీవ్రమైన, క్రూరమైన పద్ధతిలో జరుగుతున్నాయన్నది రాష్ట్ర పోలీసు యంత్రాంగం గుర్తించాలని ఆయన కోరారు. గంజాయి నుంచి విముక్తి కలిగించకపోతే నేరాల తీవ్రత మరింతగా పెరిగిపోతుందని విష్ణుకుమార్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.