తుపాన్​పై కేంద్రం హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : బీజేపీ నేత సత్యకుమార్ - bjp leader Satyakumar criticized Jagan on Twitter

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 2:57 PM IST

BJP Leader Satyakumar Criticized Jagan on Twitter : మిగ్‌జాం తుపాను హెచ్చరికలను కేంద్రం ముందే జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం అలక్ష్యం చేసిందని బీజేపీ నేత సత్యకుమార్ ట్విట్టర్​ వేదికగా ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే అన్నదాతలకు కోలుకోలేని నష్టం జరిగిందని అన్నారు. ఇలాంటి సమయంలో వరద ప్రాంతాలను పరిశీలించకపోవడం రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. రైలు ప్రమాద ఘటనలో ఏమీ కనిపించకపోయినా ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం ఇప్పుడు ప్యాలెస్​కే పరిమితం కావడం అత్యంత విషాదకరం అని విమర్శించారు. ఇలాంటి సమయాల్లో వరద ప్రాంతాల్లో పరిస్థితి పరిశీలనకు వెళ్లాలని కూడా సీఎంకు అనిపించకపోవడం అన్నదాతల పట్ల ఆయనకున్న పక్షపాత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. 

అపరాధభావం లేకపోతే రైతులను కలవడానికి ఎందుకు భయపడుతున్నరని మండిపడ్డారు. అయితే మిగ్‌జాం తుపాన్ సృష్టించిన బీభత్సం నుంచి రైతులు ఇప్పుడే తేరుకునేలా కనిపించడం లేదు. వర్షం తగ్గుముఖం పట్టడంతో మునిగిపోయిన పంటపొలాలను చూసి రైతులు బోరున విలపిస్తున్నారు. మోకాలి లోతు నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపేందుకు మార్గం లేకపోవటంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇప్పటికే మొలకెత్తుతున్న తడిచిన ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.