Bike Stunts in Kadapa: కడప నగరంలో ఆకట్టుకున్న బైక్ స్టంట్స్.. చూస్తే గూస్బంప్స్ పక్కా.. - youth enjoyed bike stunts in ysr kadapa district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 15, 2023, 1:34 PM IST
Bike Stunts in Kadapa: కడప నగరంలో హరుణ్ బజాజ్ ఆధ్వర్యంలో ప్రావీణ్యం పొందిన యువతతో నిర్వహించిన బైక్ స్టంట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. హరుణ్ బజాజ్ పల్సర్ బైకులతో నిర్వహించిన ఈ స్టంట్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఒక్కొక్క స్టంట్ చూస్తూ.. అక్కడున్న ప్రజలంతా కేకలు వేస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. బైకు స్టంట్లు చూడడానికి నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. నగరంలో బైక్ స్టంట్స్ నిర్వహించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించి, అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుని ఈ స్టంట్లను నిర్వహించారు. ఇంటికి వెళ్లిన తరువాత యువత ఇటువంటి స్టంట్లను ఎవరూ ప్రయత్నించవద్దని హరున్ బజాజ్ నిర్వాహకులు సూచించారు. ప్రావీణ్యం కలిగిన వారితో ఈ స్టంట్లను నిర్వహించామని.. ఎవరుపడితే వారు ప్రయత్నిస్తే ప్రమాదాలకు గురవుతారని తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 50 నగరాలలో ఇలాంటి స్టంట్లు నిర్వహించారని, ప్రస్తుతం కడప నగరంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.