భారత్- ఆస్ట్రేలియా T20 మ్యాచ్, ఇరు జట్ల నెట్ ప్రాక్టీస్ - విశాఖలో భారీ ఏర్పాట్లు - విశాఖ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 5:09 PM IST
Bharat Australia T-20 Match in Visakha : గురువారం విశాఖలో జరగనున్న భారత్- ఆస్ట్రేలియా టీ-20 (T-20) తొలి మ్యాచ్ కి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టిక్కెట్ల విక్రయాలను పూర్తి చేసిన నిర్వాహకులు మధురవాడ స్టేడియం బయట బారికేడింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖకు చేరుకున్న భారత్ ఆస్ట్రేలియా క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్ ఆరంభించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ నెట్ ప్రాక్టీస్ బుధవారం కూడా కొనసాగనుంది. మాచ్ జరిగే రోజున ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను నగర పోలీసులు విడుదల చేశారు. 23న సాయంత్రం టీ-20 మ్యాచ్ ప్రారంభమై రాత్రి వరకు కొనసాగనుంది.
23 November 2023 Cricket Match India VS Australia T-20 : వాతావరణం మబ్బుతో కూడి ఉన్నప్పటికి అప్పుడప్పుడు పడే చిరుజల్లుల వల్ల నెట్ ప్రాక్టీస్‌కు ఇబ్బంది కలగలేదు. మ్యాచ్ రోజున మాత్రం వర్షం రాకూడదని క్రికెట్ అభిమానులు వరుణదేవుడిని ప్రార్ధించుకుంటున్నారు.