thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 6:08 PM IST

ETV Bharat / Videos

Bengali Worker Absconded With Gold in Visakha: మసూద్ ముంచేశాడుగా..! 4 కిలోల బంగారంతో పరార్.. గోల్డ్ వ్యాపారులు షాక్..

Bengali worker absconded with gold in Visakha: విశాఖలో బంగారు ఆభరణాలు తయారు చేసే మేస్త్రీ.. స్వర్ణకారులు అప్పగించిన బంగారంతో ఉడాయించాడు. కురుపాం మార్కెట్ సమీపంలో నివాసముండే బెంగాలీ వ్యక్తి మసూద్‌... స్వర్ణకార పని చేస్తూ కొంతమంది పనివాళ్లను పెట్టుకుని ఆభరణాలు తయారీ చేసి స్థానిక వ్యాపారులకు అందజేయడం గత కొంత కాలంగా జరుగుతోంది. అదే నమ్మకంతో బ్యాంకుల నుంచి రుణాల ద్వారా గోల్డ్ బిస్కెట్లు కొనుగోలు చేసి ఆభరణాల తయారీకి ఆర్డర్లను మసూద్‌కు ఇచ్చే వాళ్లమని స్వర్ణకార సంఘాల వ్యాపారులు తెలిపారు. 

పండగ సమయం కావడంతో మసూద్... పెద్ద మొత్తంలోనే బంగారం తీసుకుని ఆభరణాల తయారీకి ఆర్డర్లు తీసుకున్నాడని వ్యాపారులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వ్యాపారుల వద్ద ఆర్డర్లకు తీసుకున్న బంగారంతో మసూద్ పరారయ్యాడు. దీంతో ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. తమ వద్ద నుంచి సేకరించిన బంగారం దాదాపు నాలుగు కిలోల వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే, మసూద్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి వద్ద పూర్తి స్థాయిలో బంగారం లేదన్న సమాచారంతో స్వర్ణకార సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మసూద్ నుంచి తమ బంగారాన్ని తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.