Minister Venu on Pilli సుభాష్ చంద్రబోస్ నాకు రాజకీయ గురువు.. సీఎం ఎలా ఆదేశిస్తే అలా!: మంత్రి వేణు - ycp
🎬 Watch Now: Feature Video
Minister Venu Cadre is a spiritual gathering: వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణుకి వైఎస్సార్సీపీ టికెట్ ఇస్తే.. తాను లేదా తన కుమారుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని, వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కేడర్‌ను మంత్రి వేణు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేయడం విదితమే. ఇదిలా ఉండగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (మంత్రి వేణు వర్గం) ఆత్మీయ కలయిక సమావేశం జరిగింగి. మంత్రి వేణు వర్గీయులు చోడవరం బైపాస్ రోడ్డులోని విజయా పంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు స్వీకరించి 23వ తేదీ నాటికి మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, రాజ్యసభ సభ్యుడు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి వేణు స్పందించారు. సుభాష్ చంద్రబోస్ తనకు రాజకీయ గురువు అని, మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నడుచుకుంటామని అన్నారు.