6న గవర్నర్, మంత్రి బొత్స పర్యటన - బారికేడ్ల ఏర్పాటుపై అంగన్వాడీల ఆగ్రహం - anantapur anganwadi
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 7:19 PM IST
Barricades Around Anganwadi Camp in Anantapur : అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూ స్నాతకోత్సవానికి ఈ నెల 6న గవర్నర్ అబ్దుల్ నజీర్ పాటు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు మంత్రి రాకను అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడ అడ్డుకుంటారేమోనని వారి ధర్నా శిబిరం చుట్టూ బారికేడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరించమంటే బారికేడ్ల ద్వారా నిర్బంధిస్తారా అని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం పెంచడానికి లేని బడ్జెటు వీటిని ఏర్పాటు చేయడానికి ఉందా అని ప్రశ్నించారు.
Anganwadi Workers Strike : గతంలో కలెక్టరేట్ ముట్టడి చేపట్టిన సమయంలో కార్యాలయం గేట్లనే ఎక్కామని, ఈ బారికేడ్లు తమకేమీ అడ్డురావని పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను పరిష్కరించే వరకు మంత్రి వాహనాన్ని అడ్డుకుంటామని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.