'విద్యారుణాలపై బ్యాంకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి' - ఆర్థిక శాఖ మంత్రి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 8:50 AM IST
Bankers Committee Meeting Was Held in Secretariat: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని గురువారం సచివాలయంలో నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, కౌలు రైతులకు రుణాల మంజూరులో బ్యాంకులు లక్ష్యాలను సాధించాలన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 3 లక్షల మందికి పైగా కౌలు రైతులకు 4 వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 75 వేల మందికి పైగా రుణాలు అందించినట్లు బుగ్గన వివరించారు. టిడ్కో గృహాలకు రుణాలు అందించాలని విద్యారుణాల మంజూరులోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు.
ప్రధాన మంత్రి ముద్ర యోజన లాంటి కేంద్ర పథకాలు, ఇతర ప్రాయోజిత కార్యక్రమాలకు బ్యాంకులు పూర్తిగా తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. నాలుగేళ్లుగా బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనలో వృద్ధిరేటు కనిపిస్తోందని బుగ్గన పేర్కొన్నారు. రైతులకు స్వల్పకాలిక పంట రుణాల కింద ఖరీఫ్, రబీ సీజన్ కలిపి కోటీ48 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఖరీఫ్‌లో 56శాతం లక్ష్యాన్ని సాధించినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ వెల్లడించింది.