Superstar Rajinikanth: విజయవాడలో తలైవా.. బాలయ్యను చూడగానే ఒక్కసారిగా..! - Rajinikanth reached Vijayawada
🎬 Watch Now: Feature Video
Balayya welcomed Superstar Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు అయన విజయవాడ వచ్చారు. నందమూరి బాలకృష్ణ, సావనీర్ కమిటీ సభ్యుడు టీడీ జనార్ధన్‌లు విమానాశ్రయంలో రజినీకాంత్‌ని రిసీవ్ చేసుకుని ఘన స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే రజనీకాంత్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్-బాలయ్య ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు. సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజినీకాంత్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేనేటి విందు ఇచ్చారు.
సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభ జరగనుంది. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన 2 పుస్తకాల విడుదల చేయనున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్టీఆర్‌పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటనారాయణ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.