బీటెక్ రవి రిమాండ్ పొడిగించిన కడప కోర్టు - పులివెందుల తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 5:45 PM IST
B Tech Ravi Remand Extended Another 14 Days: పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవికి మరో 14 రోజులు రిమాండ్(Remand) పొడిగిస్తూ కడప మెజిస్ట్రేట్ (Kadapa Magistrate) ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 11వ తేదీకి రిమాండ్ గడువు పొడిగిస్తున్నట్లు కడప మేజిస్ట్రేట్ తెలిపింది. బీటెక్ రవి కడప కోర్టుకు వచ్చిన సందర్భంగా పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
Pulivendula Constituency TDP in-charge Remand: వైఎస్ఆర్ జిల్లా(YSR District) తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి బీటెక్ రవిని ఈనెల 14న వల్లూరు పోలీసులు అరెస్ట్ చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. రిమాండ్ గడువు ముగియడంతో రవిని ఈరోజు కడప కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్‌ను డిసెంబరు 11వ తేదికి పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ముఖ్యమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోర్టుకు వచ్చి రవిని కలుసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా బీటెక్ రవిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం రవిని కడప కోర్టు నుంచి కేంద్ర కారాగారానికి తరలించారు.
రిమాండ్‌కు కారణం: ఈ ఏడాది జనవరి 25వ తేదీన నారా లోకేష్ కడపకు వచ్చిన సందర్భంగా జరిగిన ఘటనలో బీటెక్ రవిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నారా లోకేష్ కడపలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున లోకేష్‌ను కలుసుకునేందుకు పార్టీ నాయకులు తరలివచ్చారు. విమానశ్రయం గేటు వద్ద లోపలికి వెళ్లడానికి బీటెక్ రవి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయనే కారణంతో బీటెక్ రవిపైన 10నెలల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.