Auto drivers were forcefully sent to CM Meeting డబ్బులు తీసుకునే వారు.. మీరే లేకపోతే ఎలా? డ్రైవర్లను బలవంతంగా సీఎం సభకు తరలించిన అధికారులు - ap politics latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 4:04 PM IST

Officials Stopped The Autos in Tenali : సీఎం జగన్ సభ సందర్భంగా మరోసారి ప్రజలకు తిప్పలు తప్పలేదు. విజయవాడలో ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం రవాణా శాఖ అధికారులు గుంటూరు జిల్లాలోని ఆటో డ్రైవర్లను తరలించారు. తెనాలి పట్టణంతో పాటు సమీప గ్రామాల నుంచి వచ్చే ఆటోలను ఆపి మార్కెట్ యార్డులో ఉంచారు. డ్రైవర్లను మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లో విజయవాడ పంపించారు. వాహనమిత్ర లబ్ది పొందేవారితో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుకునే ప్రతి డ్రైవర్ ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరు కావాలని అధికారులు హుకూం జారీ చేశారు. వారికి ఇష్టంతో సంబంధం లేకుండా కార్యక్రమానికి బలవంతంగా తరలించారు. రవాణాశాఖ అధికారులతో ఇబ్బంది ఎందుకని ఆటో డ్రైవర్లు కూడా మౌనంగా.. వారు ఏర్పాటు చేసిన బస్సుల్లో విజయవాడ బయలుదేరి వెళ్లారు.. ఆటోలు ఆగిపోవటంతో ప్రయాణికులు  తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్లు బాగోలేక బస్సులు రావడం లేదు.. ఉన్న ఆటోలను సీఎం సభలకు పంపారంటూ, ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు లేక సకాలంలో ఇంటికి చేరకపోవడం, విద్యార్థులు స్కూల్​కి, కాలేజీకి చేరకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.