జగన్ ప్రభుత్వంలో బీసీలపై అఘాయిత్యాలు పెరిగాయి: కొల్లు రవీంద్ర - kollu ravindra at guntur ngo function hall

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 5:41 PM IST

Attrocities Increased on BC under Jagan Government: జగన్‌ పాలనలో బీసీ(BC)లపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని టీడీపీ (TDP) మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. బీసీలపై వైసీపీ (YCP) నేతలు చేస్తున్న దాడులపై నాలుగేళ్లుగా పోరాడుతున్నామన్నారు. గుంటూరు జిల్లా ఎన్జీవో (NGO) కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం బీసీ విభాగ సమావేశంలో కొల్లు రవీంద్ర, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్​యాదవ్  పాల్గొన్నారు. 

BC Communities Should Cooperate to Defeat the YCP Government: బీసీలకు వైసీపీ ప్రభుత్వం నమ్మక ద్రోహంపై ఐక్య పోరాటం పేరిట నిర్వహించిన సమావేశంలో బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల బీసీ విభాగాల నేతలు పాల్గొన్నారు.  వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా, కొత్త వైద్య కళాశాలల్లో బీసీలకు సీట్లు రాకుండా చేసిందని రవీంద్ర విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన బీసీ భవనాలను వైసీపీ ప్రభుత్వం తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా పోరాడతామని.. త్వరలోనే బీసీల చైతన్య యాత్ర చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వైసీపీ  ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీసీ సంఘాలన్నీ కలిసి రావాలని శ్రీనివాస్ ​యాదవ్ పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం లేదని, కులవృత్తుల వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో జరిగే తీర్మానాలను రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వం నెరవేరుస్తుందని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.