వేసవిలోనూ పొగమంచు.. వంజంగిలో ఆకట్టుకున్న ప్రకృతి దృశ్యాలు - Vanjangi Hills
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18130634-891-18130634-1680238549860.jpg)
వేసవి కాలమంటే ఎండలు దంచి కొడతాయి.. ఇంట్లో నుంటి బయటకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. ప్రతి ఒక్కరూ చల్లదనం కోసం పరితపిస్తుంటారు.. ఇందుకోసం చాలామంది చల్లగా ఉండే ప్రదేశాలకు విహారాలకు వెళ్తుంటారు. అలాంటి వాతావరణమే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిపిస్తోంది. వేసవిలోనూ అక్కడ మంచు అందాలు అందరినీ కట్టి పడేస్తున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి కొండల్లో పొగమంచు దట్టంగా వ్యాపించి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. వంజంగి కొండపై సుర్యోదయపు వేళలో మంచు అందాలు ఊహాతీతంగా ఉన్నాయి. శ్వేతమయమైనటువంటి కైలాస శిఖరాన్ని ఇనుమడింపజేస్తోంది. మధ్యాహ్నం వేళలోనూ ఎండ తక్కువగా ఉంటుంది. వేకువ జామున నుంచి పది గంటల వరకు ఏజెన్సీ ప్రాంతంలో పొగ మంచు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేసవిలో శీతల వాతావరణంతో పాడేరు మన్యం మైమరిపిస్తోంది. ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ.. ప్రకృతి ఇచ్చే స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ అలా కొద్దిసేపు ఆ కొండల్లో ప్రకృతి ప్రేమికులు సేద తీరుతున్నారు. అటు వైపుగా వెళ్లిన వారు తమ సెల్ ఫోన్లలో కల్మషం లేని ప్రకృతి అందాలను బంధిస్తున్నారు.
TAGGED:
Vanjangi Hills Tourist Rush