Traders Attacked: ధర్మవరం వ్యాపారులను నిర్బంధించి దుస్తులూడదీసి దాడి.. వీడియో వైరల్ - attack on Dharmavaram silk sarees traders Video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 6, 2023, 2:06 PM IST

Dharmavaram silk sarees traders Attacked: ధర్మవరం చేనేత పట్టుచీరల వ్యాపారులు ఇద్దరిని విజయవాడలోని ఓ వస్త్ర దుకాణ యజమాని, సిబ్బంది నిర్బంధించి చితకబాదారు. రెండు వారాల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మవరానికి చెందిన పట్టుచీరల వ్యాపారి ఒకరు విజయవాడ పటమట సాయిబాబా ఆలయ  ప్రాంతంలో ఉన్న ఓ వస్త్ర దుకాణానికి పట్టుచీరలు ఇచ్చాడు. డబ్బు వసూలుకు అతడు పలుమార్లు విజయవాడ దుకాణ యజమానిని సంప్రదించినా వసూలు కాలేదు. రెండు వారాల కిందట సదరు వ్యాపారి ధర్మవరంలో ఉన్న మరో వ్యాపారిని వెంట తీసుకెళ్లి విజయవాడ వస్త్రదుకాణ యజమానిని డబ్బులు అడిగారు. 

ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం ముదరడంతో విజయవాడ వస్త్ర దుకాణంలోనే ఒక గదిలో ధర్మవరం వ్యాపారులిద్దరినీ నిర్బందించి వారితో దుస్తులు ఊడదీయించి కర్రతో బెదిరించారు. ఈ దృశ్యాలను వస్త్ర దుకాణం వారే వీడియో తీశారు. 27, 46 సెకన్ల నిడివితో ఉన్న రెండు వీడియోలను ధర్మవరంలోని పలువురు చీరల వ్యాపారులకు వాట్సాప్​లో పంపారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. విజయవాడ నుంచి ధర్మవరం వచ్చిన బాధిత వ్యాపారులు ఘటనపై పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో ధర్మవరం పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ విషయాన్ని పటమట పోలీసుల వద్ద ప్రస్తావించగా దీనిపై తమకెలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.