AP Liquor Prices Decreased : వైఎస్సార్సీపీ పాలనలో మద్యం మూల ధర (బేసిక్ ప్రైస్)ను భారీగా పెంచేసిన సరఫరా కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంతట అవే తగ్గించుకున్నాయి. అప్పటి సర్కార్ పెద్దలు ఆయా కంపెనీల నుంచి కమీషన్లు తీసుకునేందుకు వీలుగా వాటికి చెల్లించే మూల ధరల్ని భారీగా పెంచేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చి వినియోగదారుల డిమాండ్‌కి అనుగుణంగా, పారదర్శకంగా ఆర్డర్లు ఇస్తుంది.
ఈ క్రమంలోనే దాదాపు 11 కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్‌ను తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల నుంచి ఏపీ బెవరేజస్ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గింది. దీంతో ఆ మేరకు వినియోగదారులకు ఊరట లభించనుంది.
మరోవైపు ఇటీవలే లిక్కర్ ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపింది. తగ్గించిన ధరలను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయిస్తారు. కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్మనున్నారు. ఏపీలో గత ఐదు సంవత్సరాల్లో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోడానికి అనుమతిస్తున్నారు.
వీటి ధరలు తగ్గాయి
- మాన్షన్ హౌస్ క్వార్టర్ ధర 2019లో గత టీడీపీ సర్కార్‌లో రూ.110 ఉండగా వైఎస్సార్సీపీ పాలనలో మొదట్లో రూ.300కు విక్రయించారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్ బాటిల్ ధర రూ.440 ఉండగా రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది.
- రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది.
- యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1600 కాగా రూ.1400కు తగ్గింది.
మద్యం వ్యాపారులకు ప్రభుత్వం వార్నింగ్ - ఎక్కువ ధరకు విక్రయిస్తే
మందుబాబులకు గుడ్‌న్యూస్ - నాణ్యతపై దృష్టి - ఎంఆర్పీ మించి అమ్మితే 5లక్షలు ఫైన్