నిమ్మకూరులో ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతి - ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు - ap NTR Vardhanthi celebration
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 7:25 PM IST
Arrangements for NTR Vardhanthi celebration: కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఈనెల 18న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొననున్నారు. హెలిప్యాడ్, ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల వద్ద వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లను తెలుగుదేశం నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వర్ల కుమార్ రాజా పరిశీలించారు.
(పీ4) పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ ప్రోగ్రాంను చంద్రబాబు, భువనేశ్వరి ప్రారంభిస్తారని టీడీపీ నేతలు తెలిపారు. అనంతరం సాయంత్రం గుడివాడలో రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొంటారని పేర్కొన్నారు. రా కదలి రా కార్యక్రమం కోసం గుడివాడలో 27 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలంతా ముందుకు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలపాలని టీడీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన నేతలు వస్తారని వెల్లడించారు. పార్టీ నేతలు, కార్యకర్తలంతా కలిసి చంద్రబాబు భహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.