Karnataka Express Train Late: క్యాంటీన్‌ సిబ్బందిపై ఏఆర్ కానిస్టేబుళ్ల దాడి.. 40 నిమిషాలు ఆలస్యంగా కర్ణాటక ఎక్స్‌ప్రెస్ - ప్రశాంతి నిలయం స్టేషన్‌లో రైల్యే సిబ్బందిపై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2023, 12:16 PM IST

AR Constables Attack On Karnataka Express Train Canteen Staff : అనంతపురం నుంచి పుట్టపర్తి వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ రైలులోని క్యాంటీన్‌ సిబ్బందిపై ఏఆర్‌ పోలీసులు దాడికి పాల్పడ్డారు. విధి నిర్వహణలో భాగంగా ఏఆర్ కానిస్టేబుళ్లు బాలాజీ, సుధీర్  పుట్టపర్తి ఎస్పీ కార్యాలయానికి చేరుకునేందుకు అనంతపురంలో రైలు ఎక్కారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో వారు క్యాంటీన్‌ బోగిలోకి ఎక్కారు. అక్కడికి ఎందుకు వచ్చారని, ఇక్కడికి రాకూడదని క్యాంటీన్‌ సిబ్బంది  ఏఆర్ కానిస్టేబుళ్లతో వాదించారు. తాము పోలీసులమని ఏఆర్​ కానిస్టేబుళ్లు దబాయించడంతో వారి మధ్య తోపులాట ప్రారంభమయ్యింది. అనంతరం క్యాంటీన్​ సిబ్బందిపై ఆర్ కానిస్టేబుళ్లు దాడికి పాల్పడటంతో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం దారి మధ్య గొడవలు పడుతూ చైన్ లాగుతూ ప్రయాణికులు ఇబ్బంది కలిగించారు. ముందస్తు సమాచారం మేరకు ప్రశాంతి నిలయం స్టేషన్‌కు చేరుకున్న 20 మంది పోలీసులు మరోసారి క్యాంటీన్‌ సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పోలీసులను, సిబ్బందిని రైల్వే అధికారులు, ప్రయాణికులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘర్షణతో రైలు సుమారు 40 నిమిషాల ఆలస్యంగా బయల్దేరింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.