APTF OPPOSE GPS SYSTEM: జీపీఎస్ పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని వంచించింది: ఏపీటీఎఫ్ - పాండురంగ వరప్రసాద్
🎬 Watch Now: Feature Video
APTF OPPOSE GPS SYSTEM: ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాత ఫెన్షన్ విధానాన్ని కోరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీపీఎస్ పేరుతో ఉద్యోగులను, ఉపాధ్యాయుల్ని వంచించిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర నేతలు ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర నేతలు పాండురంగ వరప్రసాద్, బసవ లింగారావు మాట్లాడుతూ సీపీఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి... దానిని అమలు చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు. మంత్రివర్గం ఆమోదించిన జీపీఎస్ విధానం... సీపీఎస్ కంటే అన్యాయమైందని వారు విమర్శించారు. తన వాటా నిధుల్ని తగ్గించుకోవడానికే ప్రభుత్వం జీపీఎస్ విధానం తెచ్చిందన్నారు.కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ ఉద్యోగుల్లో కనీసం 10 శాతం మందిని కూడా రెగ్యులర్ చేయలేదన్నారు. కరవు భత్యం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత లోపించిందని ఏపీటీఎఫ్ నేతలు ఆరోపించారు.
సీపీఎస్ ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జీపీఎస్ విధానం తీసుకొచ్చారు ఇది సీపీఎస్ కంటే అన్యాయమైంది. మాకు గ్రాట్యుటి వంటివి రావు పైగా మేము 10 శాతం కంట్రిబ్యూషన్ కట్టాలి. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల్ని అందరిని రెగ్యులరైజ్ చేయాలి. -పాండురంగ వరప్రసాద్, ఏపీటీఎఫ్ నేత