సంక్రాంతికి 6795 ప్రత్యేక బస్సులు - APSRTC Special Buses
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-01-2024/640-480-20441951-thumbnail-16x9-apsrtc-special-buses-due-to-sankranthi.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 10:33 AM IST
APSRTC Special Buses Due To Sankranthi: సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి, వెళ్లేవారి కోసం రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ (A.P.S.R.T.C) ప్రకటించింది. వీటిలో సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్లు తెలిపింది. ఈరోజు నుంచి ఈ నెల 14 తేదీ వరకు 3, 570 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు 3, 225 బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుంచి 1600, బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40, విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, ఇతర ప్రాంతాల నుంచి 790 బస్సులు నడిపాలని నిర్ణయించినట్లు తెలిపింది. రానూ, పోనూ టికెట్ ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణీకుల రద్దీకీ అనుగుణంగా అదనపు బస్సులను నడుపుతామని తెలిపింది. ఈ బస్సుల గురించి సమాచారం తెలుసుకునేందుకు కాల్ సెంటర్ నంబరు 149ను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు.