APPSC Group 1 Ranker Satya keerthi Interview: ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా.. పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం - అల్లూరి జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2023/640-480-19393568-thumbnail-16x9-group1-satya-interview.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 7:58 PM IST
Appsc Group 1 Satya keerthi Interview : డాక్టర్ అవ్వాలనేది ఆమె కల.. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆ ఆలోచన ప్రయత్నాలకే పరిమితం అయ్యింది. అయితేనేం మరోప్రయత్నంగా సివిల్స్, గ్రూప్స్‌లను లక్ష్యంగా ఎంచుకుంది అనకాపల్లి జిల్లాకు చెందిన సత్య కీర్తి. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో మెడికల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైంది.
సత్య కీర్తి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ తల్లి కష్టపడి కీర్తిని చదివించింది. స్కాలర్షిప్ సాయంతో కీర్తి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) అధికారులు ఏకలవ్య పేరుతో ఇచ్చిన ఉచిత కోచింగ్ సెంటర్లో ప్రతిభను పెంపొందించుకుంది. ఇటీవల వెల్లడైన గ్రూప్-1 ఫలితాల్లో మెడికల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైంది . మరి, ఉద్యోగం సాధించడానికి తను అనుసరించిన ప్రణాళిక ఎంటి..? ఈ ఉద్యోగంతో డాక్టర్ అవ్వాలనే తన కోరిక తీరినట్లేనా..? భవిష్యత్ కార్యచరణ ఏంటి..? తన మాటల్లోనే తెలుసుకుందాం..