ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు - అసంతృప్తిలో ఎమ్మెల్యే కుమారుడు - నాయకుల అసంతృప్తి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-01-2024/640-480-20422087-thumbnail-16x9-emmiganur.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 10:24 PM IST
Appointment of Yemmiganur Coordinator Dispute : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ సమన్వయకర్తగా మాచాని వెంకటేశ్‌ను అధిష్ఠానం నియమించింది. దీంతో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి తీవ్ర అసంతృప్తి చెందారు. తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టుబడ్డారు. మరోవైపు వెంకటేశ్ నియామకంపై వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గతంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తామన్నారు.
Emmiganoor MLA is Unhappy : ఎమ్మిగనూరు సమన్వయకర్తగా మాచాని వెంకటేశ్‌ను నియమించడం ఎమ్మెల్యేతో పాటు స్థానికులు కూడా అసంతృప్తి చెందుతున్నారు. స్థానిక నాయకులకు ఇవ్వకుండా పార్టీ క్యాడర్ కాని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని మండిపడ్డారు. అదే విధంగా ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి సమన్వయకర్త రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగానే ఎమ్మెల్యే కుమారుడు అసంతృప్తితో అక్కడ నుంచి వెళ్లిపోయారు. వైసీపీ అధిష్ఠానం కొత్తగా ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో పార్టీ నాయకులు, కార్యకర్తలను అసంతృప్తికి గురి చేస్తోంది.