Tulasi Reddy Comments on Jagan: 'తండ్రి బావిని తవ్విస్తే.. కొడుకు పూడ్చినట్లుంది జగన్​ వ్యవహారం' - Tulsi Reddy media conference at Vempally

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 27, 2023, 6:04 PM IST

APCC Chairman Tulasi Reddy fire on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ ప్రగతి నిరోధకుడు, రాయలసీమ ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి మండిపడ్డారు. 'తండ్రి బావిని తవ్విస్తే కొడుకు పూడ్చివేసినట్లుంది'.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలకం అని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ మంగళం పాడారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆయా ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని చెప్పారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన తులసి రెడ్డి.. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ఒప్పించి కడప - మదనపల్లి - బెంగళూరు కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయించారని గుర్తు చేశారు. రూ.359 కోట్లు ఖర్చు చేసి 21.3 కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ప్రాజెక్టును రద్దు చేయించిందన్నారు. 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ'లా రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్​ను గెలిపించడమే దీనికి పరిష్కారం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును మళ్లీ మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేస్తుందని తెలిపారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.