గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు - కరవు పరిస్థితులపై వినతిపత్రం - Vijayawada News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 10:39 PM IST
AP PCC Chief Met the Governor : కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ రైతులకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు విమర్శించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 687 మండలాల్లో కరవు ఉందని నివేదికలు చెబుతున్నా ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించిందని రుద్రరాజు మండిపడ్డారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని దీనికి పల్నాడు, కర్నూలులోని రైతుల ఆత్మహత్యలే ఉదాహరణలుగా వివరించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కరవు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని, కౌలు రైతులనూ ఆదుకోవాలని కోరారు.