ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ 1 నుంచి సమర శంఖారావం : సర్పంచులు
🎬 Watch Now: Feature Video
AP Panchayat Raj Chamber President Babu Rajendra Prasad: రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాబు రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. తిరుపతిలో రెండు రోజులపాటు సర్పంచుల సంఘం పంచాయతీ రాజ్ ఛాంబర్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకన్నారు. సమావేశం ముగిసిన అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సర్పంచుల డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇంటింటికి సర్పంచ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 660 మండల పరిషత్‌ల సర్వసభ్య సమావేశాలను సర్పంచులు, ఎంపీటీసీలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను దోపిడీ చేయడంపై ఇంటింటికీ సర్పంచ్ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 660 మండల పరిషత్‌ల సర్వ సభ్య సమావేశాలను సర్పంచులు, ఎంపీటీసీలు బహిష్కరించాలని తీర్మానం చేసినట్లు రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.
సర్పంచుల సమర శంఖారావం పేరుతో డిసెంబర్ 1 నుంచి రెండో దశ ఉద్యమం చేపట్టనున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 10 నుంచి 15 వరకు శ్రీకాకుళం, కడప, కాకినాడ, నరసరావుపేట... ప్రాంతాలలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. జనవరి 25వ తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో రాజ్యాంగం అమలు కాలేదంటూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతులు సమర్పించనున్నట్లు తెలిపారు. వార్డు సభ్యులు, ఎంపీటీసీలకు రూ.15వేలు గౌరవ వేతనం ఇవ్వాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఎంపీపీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లకు రూ.30వేల గౌరవ వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో సర్పంచుల నిరసన సదస్సులు చేపట్టనున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. తమ సమస్యలపై స్పందించే వరకూ.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని రాజేంద్రప్రసాద్ తెలిపారు.