Minister Botsa Satyanarayana on Punganur incident పుంగనూరు ఘటన దురదృష్టకరం.. మంత్రి అనుచరులు రెచ్చగోడితే రెచ్చిపోవాలా..?: మంత్రి బొత్స - Minister Botsa Satyanarayana comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2023, 4:34 PM IST

Minister Botsa Satyanarayana key comments on the Punganur incident: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులో శుక్రవారం జరిగిన విధ్వంసక సంఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని సంబోధించారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని తాను కోరుకుంటున్నానని అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రెచ్చకోడితే రెచ్చిపోతారా..?.. విజయనగరం జిల్లా గాజులరేగలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను శనివారం రోజున రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ..''పుంగనూరు, అంగళ్లులులో నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించకూడదు. చట్టాలను ఎవరైనా గౌరవించాల్సిందే. ప్రతిపక్షములో ఉన్నాం కదా అని ఎలా పడితే అలా వ్యవహరిస్తాం, మాట్లాడుతాం అంటే కుదరదు. ప్రాజెక్టుల పర్యటనల పేరుతో చంద్రబాబు దుర్భుద్దితో వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, పోలీసులు రెచ్చకోడితే రెచ్చిపోతారా..?, అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు కదా.. ఆయన బుద్ధి ఏమైంది..?. ఏదీ ఏమైనప్పటికీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని నేను కోరుకుంటున్నా. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.'' అని సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.