HC on Polavaram Illegal Mining: పోలవరం వద్ద అక్రమ తవ్వకాలపై హైకోర్టులో విచారణ - Polavaram Illegal Mining news
🎬 Watch Now: Feature Video
Polavaram illegal mining petition updates: పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) నేడు మరోసారి విచారణ జరిపింది. నేటి విచారణకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి హైకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా పోలవరం కాలువ వద్ద జరిగిన అక్రమ తవ్వకాల్లో దాదాపు 800 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందంటూ.. పిటిషనర్ తరుపు న్యాయవాది పాలేటి మహేష్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
గత కొన్ని నెలల క్రితం పోలవరం కాలువ వద్ద భారీ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ.. పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో 800 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. గత విచారణలో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ ఇంజనీర్లను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు విచారణకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, చీఫ్ ఇంజనీర్ నారాయణరెడ్డి హాజరయ్యారు.