Dy Speaker Kolagatla Yoga: నీటిపై డిప్యూటీ స్పీకర్​ కోలగట్ల యోగాసనాలు - National Swimming Pool Day 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2023, 8:39 PM IST

AP Deputy Speaker Kolagatla Water Yoga: రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్​ కోలగట్ల వీరభద్రస్వామి నీటిపై తేలుతూ యోగసనాలు వేశారు. ఈ నెల 11న జాతీయ స్విమ్మింగ్​ పూల్​ డేను పురష్కరించుకుని విజయనగరం కంటోన్మెంట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్​ పూల్​లో నీటిపై తేలియాడుతూ ఆరగంట సేపు యోగా చేశారు. అనంతరం కాసేపు సరదాగా ఈత కొట్టారు. యోగా చేస్తుంటే అక్కడికి వచ్చిన ఆయన అభిమానులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల ప్రభావం క్రీడలపై, ముఖ్యంగా పిల్లలపై పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి స్విమ్మింగ్​ అవసరమని.. దాని ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. స్విమ్మింగ్​పై అసక్తి ఉన్న పిల్లలను.. తల్లిదండ్రులు ప్రొత్సహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్​ను, స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని గుర్తు చేశారు. పిల్ల‌ల కోసం కంటోన్మెంట్ ప్రాంతంలో ఆధునిక వ‌స‌తుల‌తో కూడిన పూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని అన్నారు. ఈ నెల 11న కంటోన్మెంట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్ పూల్‌లో జల క్రీడల ప్రాధాన్యతను వివరిస్తూ యోగా జలాసనాలు వేయనున్నట్లు ప్రకటించారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.