AP CS Jawahar Reddy Review Meeting: ఎడ్యుకేషన్‌లో ముసాయిదా విధానంపై సమీక్ష.. విద్యాశాఖ అధికారులకు సీఎస్ ఆదేశాలు.. - AP CS on Education Draft Policy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 12, 2023, 8:48 AM IST
AP CS Jawahar Reddy Review Meeting: తొమ్మిదో తరగతి నుంచి పీజీ వరకూ ఫార్మల్ ఎడ్యుకేషన్‌తో పాటు వృత్తి నైపుణ్యాన్ని.. అభివృద్ధి చేసేందుకు వీలుగా ముసాయిదా విధానం రూపొందించాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి.. విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విధానం వలన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ప్రతి విద్యార్థిని ఏదో ఒక ఉపాధిలో స్థిరపడి.. జీవనోపాధి పొందే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ పాఠ్యాంశాల అమలుకు అర్హులైన టీచర్ల భర్తిని ఈ ఏడాది డిశంబరు లోపు పూర్తి చేయాలన్నారు. బహిరంగ మార్కెట్‌తో పాటు వివిధ కంపెనీల అవసరాలను బట్టి డిమాండ్ ఉన్న స్వయం ఉపాధిలో స్థిరపడేందుకు విద్యార్థులకు అనుగుణమైన కోర్సుల్లో శిక్షణనిచ్చే విధంగా ఓ ముసాయిదా సిద్ధం చేయాలని సూచనలు చేశారు. మిషన్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వంద శాతం మేర సాధించేందుకు పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థుల నమోదుకు పాఠశాల, ఉన్నత విద్యాశాఖలు తీసుకుంటున్న చర్యలను, అమ్మఒడి పథకం అమలును సీఎస్ సమీక్షించారు.