AP CPS Association Protest Against GPS : ఉద్యోగులు వద్దన్నా.. శాసనసభలో జీపీఎస్ బిల్లు పెట్టడాన్ని.. వ్యతిరేకిస్తూ నిరసనలు
🎬 Watch Now: Feature Video
AP CPS Association Protest Against GPS BiLL : రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లును శాసన సభలో పెట్టడాన్ని నిరసిస్తూ సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. జీపీఎస్ వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. జీపీఎస్ బిల్లను కేజినెట్లో ఆమోదించటం సరికాదని ఉద్యోగులు మండిపడ్డారు.
సీపీఎస్ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా జీపీఎస్ బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ బిల్లును సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఎవరూ అంగీకరించటం లేదని.. జీపీఎస్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు సీపీఎస్ ఉద్యోగులు వెల్లడించారు. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విన్నతి పత్రాలను ఇస్తామని తెలిపారు. కేజినెట్ ఆమోదంతో ప్రభుత్వం చేసేది పూర్తైంది. ఇప్పుడు శాసన సభలో ప్రవేశపెడుతున్నారు. అందుకని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం.. జీపీఎస్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దని కోరారు.