మరో 4 నెలల్లో జగన్ ఇంటికే - చంద్రబాబుతోనే అమరావతి నిర్మాణం: కొలికపూడి
🎬 Watch Now: Feature Video
AP Conservation Society President Kolikapudi Srinivasa Rao: రుషికొండలోని మిలేనియం టవర్స్‌ను సీఎం జగన్ పరిపాలనా భవనాలుగా మార్చారని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఐటీ టవర్స్‌ను పాలనాభవనంగా మారిస్తే... రాష్ట్రానికి వేల కోట్లు నష్టం వాటిల్లుతుందని కొలికపూడి ఆరోపించారు. హైదరాబాద్‌లో పల్లెకు పోదాం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెట్టుబడిదారులను ఒప్పిస్తేనే ఏ రాష్టానికైనా పరిశ్రమలు వస్తాయని.. కానీ, సీఎం జగన్ ఆ పని చేయడం లేదని కొలికపూడి ఆరోపించారు. ఏపీలోని సాఫ్ట్‌వేర్ సంస్థలను జగన్ తరిమే ప్రయత్నాలు చేస్తున్నారని కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పాలనా భవనాలను చంద్రబాబు ట్రిపుల్ ఐటీ భవనాలుగా మార్చారని.. చంద్రబాబు చేసిన పని వల్లే హైదరారాబాద్‌లో నాలెడ్జ్ ఎకానమీ ఏర్పడిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
జగన్ మాత్రం నాలుగున్నర ఏళ్లుగా అమరావతిని ధ్వంసం చేశారని ఆరోపించారు. అమరావతి రైతులకు ప్రతి ఆంధ్రుడూ అండగా నిలిచాడని కొలికపూడి పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం జరగాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ చర్యల వల్ల పేదలు చదువుకు దూరం అవుతున్నారని కొలికపూడి ఆరోపించారు. నాలుగేళ్లపాటు ఏపీ స్టడీ సర్కిల్‌ని సైతం మూసేశారని విమర్శలు గుప్పించారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు మరో 4 నెలల సమయం ఉందని.. అంతా కలిసి కట్టుగా పోరాడాలని కొలికపూడి పిలుపునిచ్చారు.