AP CID Notices to Ex Minister Narayana: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు - CID Notices to Ex Minister Narayana
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 6:54 PM IST
AP CID Notices to Ex Minister Narayana: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులిచ్చిన అధికారులు.. అదే రోజు రావాలని నారాయణనూ కోరారు. ఇద్దరినీ కలిపి విచారించాలని.. సీఐడీ అధికారులు యోచిస్తున్నారు. నోటీసులపై నారాయణ స్పందించారు. సీఐడీ నోటీసుల ప్రకారం ఈనెల 4న విచారణకు హాజరవుతానని.. వివరాలన్నీ అధికారులకు వెల్లడిస్తానని నారాయణ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉండటంతో అంతకుమించి దీనిపై స్పందించనని నారాయణ తెలిపారు.
ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి నారా లోకేశ్‌కు నోటీసులు సీఐడీ నోటీసులు అందాయి. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ వ్యవహారానికి సంబంధించి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.