Andhra Pradesh Secretariat Employees : సచివాలయంలోని 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్.. - telugu latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-09-2023/640-480-19626219-134-19626219-1695866900941.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 8:45 AM IST
Andhra Pradesh Secretariat Employees: సచివాలయంలోని కొందరు సెక్షన్ అధికారులకు అసిస్టెంట్ సెక్రటరీలుగా కల్పించిన పదోన్నతుల్ని వెనక్కు తీసుకున్న ప్రభుత్వం.. వారిని ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్రటరీల నుంచి రివర్షన్ పొందిన 50 మంది సెక్షన్ ఆఫీసర్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. రివర్షన్ పొందిన వారిని ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఆర్డర్ మేరకు గతంలో సెక్షన్ అధికారులకు ఇచ్చిన పదోన్నతుల్ని ప్రభుత్వం రివర్షన్ చేసింది. తాత్కాలిక ఇన్‌ఛార్జ్ సెక్రటరీలుగా కొనసాగుతున్న వారికి సెక్షన్ ఆఫీసర్ల పేస్కేలు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హైకోర్టు తుది ఉత్తర్వుల మేరకే ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీల బాధ్యతలు ఉంటాయని స్పష్టం చేస్తూ ఆదేశాల్లో తెలిపింది. గతంలో అసిస్టెంట్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించేందుకు ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం రివర్షన్ పొందిన వారందరి సర్వీసును ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.