Municipal Outsourcing Workers Problems: "మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్త ఉద్యమం" - telugu news live
🎬 Watch Now: Feature Video
Andhra Pradesh Municipal Outsourcing Workers Problems: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని.. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై జూలై నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్, జిల్లా కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇదే కాకుండా ఈ నెల చివరి వారం నుంచి అగస్టు వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తానన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తాజాగా కేవలం కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులర్ చేస్తానని ప్రకటించిందని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను జగన్మోహన్ అధికారం చేపట్టి ముఖ్యమంత్రైన తర్వాత విస్మరించారని మండిపడ్డారు. సమానపనికి సమానవేతనమని అప్పుడు అని.. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అప్పుడు మాట తప్పను.. మడమ తిప్పను అని ఇచ్చిన హామీలను.. ఇప్పుడు నేరవేర్చటం లేదని విమర్శించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని.. వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.