ఎంజీఆర్ షాపింగ్ మాల్లో సందడి చేసిన యాంకర్ అనసూయ - Anasuya Bharadwaj in annamyya district
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 6:57 PM IST
Anchor Anasuya Inaugurates MGR Shopping Mall: ప్రముఖ బుల్లితెర నటి,యాంకర్ ,సినీతార అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) షాపింగ్ మాల్లో సందడి చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో నూతనంగా వెలసిన ఎంజీఆర్(MGR) షాపింగ్ మాల్‌ను యాంకర్ అనసూయ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంజీఆర్ షాపింగ్ మాల్స్ ఇటీవలే మదనపల్లి,తిరుపతి,రాయచోటి, రాజంపేట ప్రాంతాలలో నూతనంగా ప్రారంభించారని తెలిపారు. నాణ్యమైన,మన్నికైన ఉత్పత్తులను నేటి యువతీ,యువకులకు అందుబాటులో తేవడంలో ఎంజీఆర్ మాల్ ముందుంటుదని అన్నారు.
MGR Mall Opening in Annamayya District: పర్వదినాలలో ప్రజలు కడప,తిరుపతి,నెల్లూరు ప్రాంతాలకు వెళ్లి బట్టలు కొనుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా రాజంపేట పట్టణంలోనే ఎంజీఆర్ మాల్లో ఏర్పాటుచేశారని తెలిపారు. మహిళలకు రకాల చీరలు,డ్రెస్ మెటీరియల్స్, మగవారికి కావలసిన ప్యాంట్లు,షర్ట్స్,టీ షర్ట్లు అందుబాటులో ఉంటాయన్నారు.అన్ని రకాల వస్త్రాలను అతి తక్కువ ధరకే సామాన్యులకు ఎంజీఆర్ షాపింగ్ మాల్ అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఎంజీఆర్ సందర్శించి కావలసిన దుస్తులను ఎంపిక చేసుకోవాలన్నారు. ఎంజీఆర్‌లో అన్ని వేడుకలకు కావాల్సిన దుస్తులు దొరుకుతాయని,క్వాలిటీ బావుంటుందని తెలిపారు. అనసూయను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.