Anam Ramanarayana Reddy House Arrest: అక్రమ మైనింగ్‌ పరిశీలనకు వెళ్లకుండా బలప్రయోగం.. 'సైకో' ఆనందం కోసం పనిచేస్తున్న పోలీసులు : ఆనం - రామనారాయణ రెడ్డి వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2023, 12:40 PM IST

Police Try to House Arrest Anam Ramanarayana Reddy : రాష్ట్రంలో యథేచ్ఛగా ధన దుర్వినియోగం చేస్తూ.. ఇసుక, మైనింగ్‌, గ్రావెల్‌, చివరకు తెల్లరాయిని సైతం దోచుకుంటూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy Allegations on White Stone) ఆరోపించారు. ఈ తరుణంలో నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో తెల్లరాయి అక్రమ మైనింగ్‌పై రాజకీయ వేడి రాజుకుంది. అధికార పార్టీ నాయకులు తెల్లరాయిని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతలు.. ఆ ప్రాంత పరిశీలనకు సిద్ధం అయ్యారు. ఇదే సమయంలో పోలీసులు ఆంక్షలు విధించి.. అక్రమ మైనింగ్ క్వారీల పరిశీలనకు వెళ్లకుండా టీడీపీ బృందాలను అడ్డుకున్నారు. టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆనం రామనారాయణ రెడ్డి ఇంటి వద్ద లేక పోవడంతో హౌస్‌ అరెస్ట్‌ నోటీసులు ఇచ్చేందుకు అక్కడే పోలీసులను వేచి ఉన్నారు.

పోలీసులపై ధ్వజమెత్తిన ఆనం రామనారాయణ రెడ్డి : బయట నుంచి వస్తున్న ఆనం రామనారాయణ రెడ్డిని ఇంటి వద్దే పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పర్యటనకు వెళ్లకుండా కానిస్టేబుల్‌ తనపై చేయి వేసి అడ్డుకున్నారని. పోలీసులు ఒక సైకోకు కాపు కాస్తున్నారని.. ప్రజలకు మంచి కాదని ఆనం ఆరోపించారు. సైకోకు పైశాచిక ఆనందం కోసం పోలీసులు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సైదాపురంలోనే అరెస్టు చేయండి చేయాలని అన్నారు. నెల్లూరులో ఇంటి వద్దే అడ్డుకోవడం దారుణం అని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.