Amaravati Assigned Lands Case in High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. కొత్త ఆధారాలు సమర్పించిన సీఐడీ.. విచారణ వాయిదా - అమరావతి అసైన్డ్ భూముల కేసు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 1:01 PM IST
Amaravati Assigned Lands Case in High Court: రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఇదే కేసులో విచారణ పూర్తి కాగా కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకుని.. కేసును రీ ఓపెన్ చేసి విచారించాలని సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి నారాయణ పిటిషన్ వేయగా.. దీనిపై ఇటీవలే తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఇటీవల మరో నలుగురి పేర్లు కేసులో చేర్చామని.. కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే సీఐడీ పిటిషన్ విచారణపై నారాయణ తరఫు లాయర్లు అభ్యంతరం తెలిపారు.
తీర్పు ఇచ్చే సమయంలో మళ్లీ పిటిషన్ సరికాదని.. వేరే కేసులోని ఆధారాలు ఈ కేసులో ఎలా దాఖలు చేస్తారని నారాయణ తరఫు లాయర్లు అన్నారు. ప్రస్తుతం సీఐడీ అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను పరిశీలించిన హైకోర్టు.. కేసు రీఓపెన్‌కు ఏమైనా అభ్యంతరాలుంటే ప్రతివాదులు కౌంటర్ వేయాలని హైకోర్టు పేర్కొంది. హైకోర్టుకు ఆడియో ఫైల్స్‌ను అందించిన సీఐడీ తరఫు న్యాయవాదులు.. మంగళవారం మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని వెల్లడించారు. అనంతరం ఈ కేసును వచ్చే నెల 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.