Allegations on Krishna water Redistribution: 'రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం తప్ప.. కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిలదీయడం లేదు?'
🎬 Watch Now: Feature Video
Allegations on Krishna water Redistribution: రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటలతో మభ్య పెట్టడం తప్ప.. రైతులకు, ప్రజలకు చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కృష్ణా జలాల పునః పంపిణీ పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోట్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన మిగులు జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరిగేలా అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్రం ఇప్పటికే అప్పర్ భద్రకు నిధులు కేటాయించి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో కృష్ణాజలాల నీటి వాటాను మార్పు చేయడం సరికాదన్నారు. కోర్టులకు వెళ్తే ఇలాంటి విషయాలు తెగవని, రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర పెద్దలను ఎదిరించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రానికి, రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్, మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరిగేలా అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ త్వరలో దీనిపై ప్రణాళిక ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతుందన్నారు.