All Party Meeting at Visakha TDP Office: 'చంద్రబాబు అరెస్టుతో జగన్ సెల్ఫ్ గోల్.. మద్యపాన నిషేధం హామీ అమలెక్కడ..?' - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 11, 2023, 5:03 PM IST
All Party Meeting at Visakha TDP Office: విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన, సీపీఐ, సీపీఎం ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చ సాగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శాసనసభ సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్యే గండి బాబ్జి, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవి రావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ పార్లమెంట్ ఇంఛార్జ్ భరత్ సహా జనసేన నేతలు పంచకర్ల రమేశ్ బాబు, శివ శంకర్, కోన తాతారావు, పసుపులేటి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్, సీపీఐ జిల్లా నాయకుడు పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు.. చంద్రబాబు అరెస్టు జరిగినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించడానికి పవన్ కల్యాణ్ ఫ్లైట్ ఎక్కితే ఆ విమానం విజయవాడలో దిగడానికి వీలు లేదని ఆపేశారని అన్నారు. విశాఖలో కొందరు మహిళలు నిరసన చేయడానికి సిద్ధమైతే.. పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడని అన్నారు. ప్రజా వ్యతిరేక అంశాలు మీద టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. ఎప్పుడెప్పుడు జగన్‌కి బైబై చెప్పాలా.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టో 99శాతం హామీలు అమలు చేశామని చెప్తున్న వైసీపీ పెద్దలు మరి మద్యపాన నిషేధం అమలు చేశారా..? అని ప్రశ్నించారు.