Agrigold Victims Protest in Vijayawada: అగ్రిగోల్డ్ బాధితులను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపైనే బైఠాయింపు - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2023, 3:51 PM IST
Agrigold Victims Protest in Vijayawada: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. అగ్రిగోల్డ్ శంఖారావం సభ పేరిట విజయవాడకు వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ ఉన్నందున ఆందోళనకు అనుమతి లేదన్నారు. పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు. అగ్రిగోల్డ్ బాధిత సంఘం నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.
Implementation of Section 144 in NTR District: ఆగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు నుంచి అనుమతులు లేవని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉంటాయని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబడదని పేర్కొన్నారు. ప్రజల నిత్య జీవనానికి ఇబ్బందులు కలుగుతాయనే అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసారు. పోలీసుల ఆదేశాలను కాదని ఎవరైనా వస్తే సెక్షన్లు 143, 290, 198 కింద పలు కేసులు పెడతామని హెచ్చరించారు.