Advocate VV Lakshminarayana on High Court Interim Orders: 'స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో 17ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టు భావిస్తే చంద్రబాబుకు బెయిల్​' - Andhra Pradesh high court news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 6:16 PM IST

Advocate VV Lakshminarayana on High Court Interim Orders: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసులకు సంబంధించి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో ఊరట లభించిన విషయం తెలిసిందే. అంగళ్లు కేసులో 12వ తేదీ (గురువారం) వరకు ఆయనను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. దాంతోపాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ 16వ తేదీ (సోమవారం) వరకు చంద్రబాబు అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ.. రెండు కేసులకు సంబంధించిన  మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం జారీ చేసింది. అయితే, ఆ మధ్యంతర ఉత్తర్వుల్లో ఏముంది..? న్యాయవాదులు వాదించిన వాదనలు ఏమిటి..? రేపు కోర్టులో విచారణ దేనిపై జరగనుంది..? అనే తదితర అంశాలపై హైకోర్ట్ సీనియర్ న్యాయవాది వివి లక్ష్మినారాయణ ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు.

VV Lakshminarayana Comments: హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై న్యాయవాది మాట్లాడుతూ..''అంగళ్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులలో హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తెలుగుదేశం అధినేత ముందస్తు బెయిల్ పిటిషన్లపై భోజన విరామం తర్వాత హైకోర్ట్ తిరిగి విచారణ ప్రారంభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టులో ఉత్తర్వులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది. రేపటి విచారణలో అంగళ్లు కేసుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి.. 17ఏ వర్తిస్తుందని న్యాయస్థానం అంగీకరిస్తే చంద్రబాబుకు బెయిల్ వస్తుంది. ఆ తర్వాత ఈ కేసులు కూడా కొట్టివేయబడతాయి'' అని ఆయన అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.