Achanna Letter to Prisons Department DG on Chandrababu Health: చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించండి.. జైళ్ల శాఖ డీజీకి అచ్చెన్న లేఖ - చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 10:19 PM IST

Achanna Letter to Prisons Department DG on Chandrababu Health: రాజమహేంద్రవరం జైలులో స్కిన్‌ ఎలర్జీతో బాధపడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని విషయం తెలియగానే చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్​ని కలిసి మాట్లాడేందుకు అపాయింట్​మెంట్ ఇవ్వాలని కోరినా సమయం ఇవ్వలేదని టీడీపీ నాయకులు విమర్శించారు. దీంతో జైళ్ల శాఖ డీజీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ-మెయిల్ ద్వారా తమ విన్నపాన్ని పంపారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా ఆయనకి మెరుగైన వైద్యం అందించాలని అలాగే జైల్లో చంద్రబాబు ఉన్న ప్రాంతాన్ని ఆయన ఆరోగ్యానికి తగ్గట్టుగా ఉంచాలని కోరారు. చంద్రబాబుకి చికిత్స అందించేందుకు ఆయన వ్యక్తిగత మెడికల్ డాక్టర్ల బృందాన్ని అనుమతించాలని కోరారు. ఈ రోజు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు అత్యవసర సమావేశమై చర్చించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.